పోలీసు కమిషనర్‌గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరణ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం: సజ్జనార్
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి కొత్త పోలీసు కమిషనర్‌గా వీసీ సజ్జనార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర భద్రత, ప్రజల రక్షణలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను భవిష్యత్తు చీకట్లోకి నెడుతున్న డ్రగ్స్ సమస్యను ప్రధానంగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
“హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరం. ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రగ్స్. దీనిపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ సరఫరాదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం. మరింత సిబ్బందిని కేటాయించి ఆపరేషన్లు చేపడతాం. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుని నేర శృంఖలాలను ఛేదిస్తాం” అని సజ్జనార్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నగర భద్రతకు సంబంధించిన అనేక అంశాలపై ఆయన ప్రస్తావించారు. ట్రాఫిక్ సమస్యలు, మహిళల భద్రత, సైబర్ క్రైమ్‌ల నియంత్రణ వంటి అంశాలను కూడా సమగ్రంగా పర్యవేక్షిస్తామని తెలిపారు.
కొత్త పోలీసు కమిషనర్‌గా సజ్జనార్ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో, నగరంలో డ్రగ్స్ మాఫియాకు చెక్ పడుతుందన్న నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
Post a Comment