దసరా – గాంధీ జయంతి ఒకే రోజు సెలవు నిర్ణయంపై HMS యూనియన్ తీవ్ర ఆగ్రహం
మణుగూరు: సింగరేణి యాజమాన్యం దసరా, గాంధీ జయంతి పండుగ సెలవులను ఒకే రోజున ప్రకటించడం కార్మికుల్లో తీవ్ర నిరాశ కలిగించిందని HMS యూనియన్ విమర్శించింది.
కార్మికుల తరఫున పలు సార్లు మోరపెట్టుకున్నప్పటికీ, సంప్రదాయాన్ని పక్కన పెట్టి యాజమాన్యం ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ యూనియన్ మండిపడింది. తెలంగాణ సంప్రదాయం ప్రకారం దసరా పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఘనంగా జరుపుకునే ఆచారం ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
దీనికి గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు సహకరించడాన్ని HMS యూనియన్ ఖండించింది. "కార్మికుల శ్రేయస్సు, ఆత్మగౌరవం పక్కన పెట్టి సెలవులు మార్చకుండా, ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం అన్యాయం. గుర్తింపు సంఘాల వైఖరి కూడా కార్మికులకు అన్యాయం చేసేలా మారింది" అని యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత స్పష్టం చేశారు.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దసరా ఉత్సవాలను బహిష్కరించనున్నట్లు HMS యూనియన్ ప్రకటించింది. "కార్మికుల హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం శ్రమించే మా పోరాటం కొనసాగుతుంది" అని శ్రీలత తెలిపారు.
Post a Comment