డాక్టర్ ఎస్. జయలక్ష్మి అధ్యక్షతన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం
భద్రాచలం, సెప్టెంబర్ 29: జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం ఈ రోజు డాక్టర్ ఎస్. జయలక్ష్మి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) మాట్లాడుతూ, జిల్లాలో PC & PNDT చట్టం అమలు కఠినంగా కొనసాగుతుందని తెలిపారు. అల్ట్రాసౌండ్ యంత్రాలను అనుమతి లేకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే, ఫారం-B (Form-B) లో నమోదు అయిన వైద్యులకే అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించే హక్కు ఉందని, అర్హతలేని వారు ఇలాంటి ప్రక్రియలు చేస్తే PC & PNDT చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని అల్ట్రాసౌండ్ కేంద్రాలు తప్పనిసరిగా అవసరమైన రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత వుందని డీఎంఅండ్‌హెచ్ఒ తెలిపారు.
జిల్లా ప్రజల సౌకర్యార్థం ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 7675039167 అందుబాటులో ఉంచినట్టు ప్రకటించారు. ఎవరైనా ఉల్లంఘనలు గమనించినప్పుడు ఈ నంబర్ ద్వారా ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డా. ముకంరేశ్వరరావు, డా. అనూష, డా. పుల్లారెడ్డి, డా. తేజస్వి, Md. ఫైజ్ మొహియుద్దిన్, చి. శ్రీనివాస్, రామదేవి, పరంగైనీ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment