మేడారంలో అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మేడారంలో అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా: సెప్టెంబర్ 23 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. రెండేళ్లకొకసారి జరిగే మహా జాతరతో పాటు, ఏడాది పొడవునా భక్తుల రాకపోకలతో కిటకిటలాడే మేడారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం పర్యటన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకోగా, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్ కూడా ఆయనతో పాటు వచ్చారు. వారిని రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ ఘనంగా స్వాగతం పలికారు.

తర్వాత 12:40 గంటలకు గిరిజన పూజారులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతూ సీఎం, మంత్రులను అమ్మవార్ల గద్దెల ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చిరే సారా సమర్పించి, తన ఎత్తు బంగారం సమర్పించడం విశేషం.

తరువాత సీఎం గిరిజన పూజారులతో సమావేశమై, సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా చేపట్టవలసిన పనులు, గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ అంశంపై చర్చించారు. మేడారం అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.