భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ అధ్యక్షురాలిగా రెంటపల్లి మాధవి లత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ అధ్యక్షురాలిగా రెంటపల్లి మాధవి లత


భద్రాద్రి కొత్తగూడెం : దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా రెంటపల్లి మాధవి లత బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి అధ్యక్షతన కొత్త కమిటీ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా మాధవి లతకు నియామక ఉత్తర్వులను అందజేశారు. అదే విధంగా జిల్లా కమిటీని కూడా ప్రకటించారు. ఉపాధ్యక్షురాలిగా పూజారి జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా ఇటికల మాధవి, కార్యదర్శిగా మల్లు సరిత, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా భోగ లక్ష్మి, మాలోతు సువర్ణ బాధ్యతలు చేపట్టారు.

నియామక అనంతరం రెంటపల్లి మాధవి లత మాట్లాడుతూ, “మహిళల రక్షణ, సంక్షేమం కోసం ‘దిశ’ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది. నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన వాసర్ల నాగమణి గారికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలపై జరుగుతున్న అణచివేత, వేధింపులపై పోరాడటమే కాకుండా, వారికి చట్టపరమైన సహాయం, అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి మహిళకు ‘దిశ’ అండగా నిలుస్తుంది” అని అన్నారు.

సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు వాసర్ల నాగమణి మాట్లాడుతూ, “దిశ ఫౌండేషన్ స్థాపన నుంచి మహిళల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం కృషి చేస్తోంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ జిల్లా వ్యాప్తంగా మరింత చురుకైన పాత్ర పోషిస్తుందని విశ్వాసం ఉంది” అని పేర్కొన్నారు. ఈ  సమావేశంలో ఫౌండేషన్ నాయకులు, సభ్యులు పాల్గొని కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సంక్షేమం కోసం సమాజంలోని ప్రతి వర్గం సహకరించాలని వారు ఆకాంక్షించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.