దిశా ఉమెన్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూలూరుపాడులో బతుకమ్మ సంబరాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దిశా ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కోడెం సీతా కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో స్థానిక మహిళలు విస్తృతంగా పాల్గొని బతుకమ్మను ఆడిపాడుతూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూలూరుపాడు ఎస్ఐ దంపతులు, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసర్ల నాగమణి, జిల్లా అధ్యక్షురాలు రెట్టపల్లి మాదవి లత, ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కావేటి రేవతి హాజరై బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. వారితో కలిసి మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ ఉత్సాహంగా నృత్యం చేశారు.
అదే విధంగా ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ వసంత, ఉమా మరియు మరికొందరు నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ సంబరాలకు మరింత చక్కదనం చేకూర్చారు.
వాసర్ల నాగమణి మాట్లాడుతూ, మహిళల ఐక్యత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యం అని, బతుకమ్మ లాంటి సాంప్రదాయ పండుగలు మహిళల సాంస్కృతిక ప్రతిభను వెలికి తీస్తాయని తెలిపారు.
Post a Comment