కాంగ్రెస్ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖాజా బక్ష్‌కు ఘన సన్మానం
కాంగ్రెస్ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖాజా బక్ష్‌కు ఘన సన్మానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :: కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్‌గా ఇటీవల నియమితులైన మొహమ్మద్ ఖాజా బక్ష్‌ను ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మైనారిటీ వర్గాల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి సమయంలో మొహమ్మద్ ఖాజా బక్ష్‌కు లభించిన పదవి సంతోషకరమని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తారని, కొత్తగూడెం పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
సన్మాన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువనేతలు, ఐఎన్టీయూసీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment