సామాన్యులకు అందుబాటులోకి రానున్న నిత్యవసర సరుకుల ధరలు!
త్వరలో సామాన్యులకు అందుబాటులోకి రానున్న నిత్యవసర సరుకుల ధరలు!
హైదరాబాద్, సెప్టెంబర్ 19: దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు గుడ్‌న్యూస్. నెలవారీ ఖర్చులు తగ్గేలా నిత్యావసర వస్తువుల ధరలు చౌకగా అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల 22వ తేదీ నుండి కొత్త ధరలు అమల్లోకి వస్తున్నట్లు ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రకటించాయి.
ఇకపై కేవలం 5% మరియు 18% జీఎస్టీ శ్లాబులు మాత్రమే ఉండగా, ధరల కోతను వినియోగదారులకు అందజేస్తున్నాయి. దీంతో షాంపూలు, సబ్బులు, టూత్‌పేస్టులు, టూత్‌బ్రష్‌లు, రేజర్లు, బేబీ డైపర్లు, హెల్త్ డ్రింకులు వంటి ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపు లభించనుంది.
హిందుస్థాన్ యూనిలీవర్ ఉత్పత్తుల కొత్త ధరలు
- డోవ్ షాంపూ (340 మి.లీ.) – ₹490 ➝ ₹435
- డోవ్ సబ్బు (75గ్రా) – ₹45 ➝ ₹40
- క్లినిక్ ప్లస్ షాంపూ (355 మి.లీ.) – ₹393 ➝ ₹340
- సన్‌సిల్క్ షాంపూ (350 మి.లీ.) – ₹430 ➝ ₹370
- లైఫ్‌బాయ్ సబ్బులు (4 x 75గ్రా) – ₹68 ➝ ₹60
- లక్స్ గ్లో సబ్బులు (4 x 75గ్రా) – ₹96 ➝ ₹85
- క్లోజ్‌అప్ టూత్‌పేస్ట్ – ₹145 ➝ ₹129
- హార్లిక్స్ చాక్లెట్ (200గ్రా) – ₹130 ➝ ₹110
- బూస్ట్ (200గ్రా) – ₹124 ➝ ₹110
- కిసాన్ కెచప్ (850గ్రా) – ₹100 ➝ ₹93
- కిసాన్ జామ్ (200గ్రా) – ₹90 ➝ ₹80
- బ్రూ కాఫీ (75గ్రా) – ₹300 ➝ ₹270
ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఉత్పత్తుల కొత్త ధరలు
- విక్స్ యాక్షన్ 500 అడ్వాన్స్/ఇన్హేలర్ – ₹69 ➝ ₹64
- హెడ్ అండ్ షోల్డర్స్ కూల్ మెంథాల్ (300 మి.లీ.) – ₹360 ➝ ₹320
- హెడ్ అండ్ షోల్డర్స్ స్మూత్ & సిల్కీ (72 మి.లీ.) – ₹89 ➝ ₹79
- ప్యాంటీన్ షాంపూ (340 మి.లీ.) – ₹410 ➝ ₹355
- గిల్లెట్ షేవింగ్ క్రీమ్ (30గ్రా) – ₹45 ➝ ₹40
- షేవింగ్ బ్రష్ – ₹85 ➝ ₹75
- ఓల్డ్‌స్పైస్ షేవింగ్ లోషన్ (150 మి.లీ.) – ₹320 ➝ ₹284
- ఓరల్ బి టూత్‌బ్రష్ – ₹35 ➝ ₹30
👉 కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి.
ఇకపై సామాన్యులు రోజువారీ వినియోగ ఉత్పత్తులను మరింత తక్కువ ఖర్చుతో పొందే అవకాశం లభించనుంది.
Post a Comment