లయన్స్ క్లబ్ మిలీనియం కొత్తగూడెం ఆధ్వర్యంలో వితంతు మహిళకు ఉచిత గ్యాస్ కనెక్షన్

లయన్స్ క్లబ్ మిలీనియం కొత్తగూడెం ఆధ్వర్యంలో వితంతు మహిళకు గ్యాస్ కనెక్షన్


కొత్తగూడెం : సెప్టెంబర్ 24 : లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం ఆధ్వర్యంలో మానవతా సేవలో భాగంగా వితంతు మహిళకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందజేశారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ Ch. V. శివప్రసాద్, పాల్వంచలోని హమాలీ కాలనీకి చెందిన భద్రమ్మ కుటుంబానికి HP గ్యాస్ కనెక్షన్‌ను ఉచితంగా అందించారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ బొక్క శ్రీనివాస్, క్లబ్ జోనల్ చైర్‌పర్సన్ పల్లపు వెంకటేశ్వర్లు, ట్రెజరర్ పగడాల నగేష్, డిస్ట్రిక్ట్ జాయింట్ కోశాధికారి పితాని సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్స్ MjF రాయల శాంతయ్య, MjF J. B. మోహన్, MjF లయన్ మండల రాజేశ్వరరావు, బండారి మల్లయ్య, T. శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ "సమాజంలోని నిరుపేదలు, వితంతువులకు అండగా నిలిచి సేవ చేయడం లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం ప్రధాన ధ్యేయం" అని పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.