అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఇల్లందు డిఎస్పీ చంద్రభాను

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఇల్లందు డిఎస్పీ చంద్రభాను


ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని వినోభా నగర్ లో, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఇల్లందు డిఎస్పీ చంద్రభాను ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 250 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. సరిగా పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్లు లేని 70 ద్విచక్ర వాహనాలు, 03 ఆటోలు, ఒక కారు ను పోలీసులు సీజ్ చేశారు.

తరువాత స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి డిఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ—

  • అసాంఘిక కార్యకలాపాలు (మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా మొదలైనవి) చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని తెలిపారు.
  • ఇలాంటి వ్యక్తులపై సమాచారం అందిస్తే, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
  • ఎవరైనా ఆపదలో ఉన్నపుడు వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు.
  • సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
  • తమ పరిధిలోని సమస్యలు ఎప్పుడైనా పోలీసులకు తెలియజేస్తే, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మంది పైగా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.