GST మార్పులతో తగ్గనున్న ACలు, TVలు, వాషింగ్ మెషిన్ల రేట్లు..!!

GST మార్పులతో తగ్గనున్న ACలు, TVలు, వాషింగ్ మెషిన్ల రేట్లు..!!


న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ చేసిన హామీ ప్రకారం జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు ప్రకటించింది.

ఇకపై 12%‌, 28%‌ జీఎస్టీ స్లాబులు రద్దు చేసి, కేవలం 5%‌, 18%‌ రేట్లే కొనసాగించనున్నాయి. దీంతో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

🔹 28% నుంచి 18%కు తగ్గింపు

  • ACలు : రూ.1,500–రూ.2,500 వరకు తగ్గింపు
  • పెద్ద టీవీలు : మోడల్‌ను బట్టి రూ.1,000–రూ.5,000 వరకు తగ్గింపు
  • ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు : వేలల్లో తగ్గింపు

🔹 32 ఇంచెస్ లోపు టీవీలపై 5% GST
మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనే చిన్న టీవీల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

🔹 మొబైల్ ఫోన్లకు ఊరట లేదు
ఇప్పటికీ 18% GST కొనసాగించడంతో మొబైల్ ధరలు తగ్గే అవకాశమే లేదు.

ఇటీవలి అకాల వర్షాల కారణంగా విక్రయాలు తగ్గిన ఎలక్ట్రానిక్ కంపెనీలకు ఈ నిర్ణయం ఊతం కలిగించనుంది. రానున్న దసరా–దీపావళి సీజన్‌లో మధ్యతరగతి కుటుంబాలకు నిజమైన ఫెస్టివల్ గిఫ్ట్‌గా మారనుంది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.