కోటి 15 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!

కోటి 15 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! 8వ వేతన సంఘానికి కేంద్ర కేబినెట్ ఆమోదం


న్యూఢిల్లీ : అక్టోబర్ 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వెలువడింది. 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి 15 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులకు వేతనాలు – పింఛన్ల పెంపు దిశగా మార్గం సుగమమైంది.

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన్ దేశాయ్ ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఇద్దరు సభ్యులతో కూడిన ఈ కమిషన్, 18 నెలల్లోపు సిఫార్సులు సమర్పించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగియనుంది. ఆ తర్వాతి కాలానికి వేతన సవరణ అమలుకు ముందస్తు ఏర్పాటుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే ఈ ఆమోదం లభించింది.

ప్రస్తుతం దేశంలో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరి వేతనాలు, భత్యాలు, పింఛన్ల పెంపు వంటి అంశాలపై 8వ వేతన సంఘం కీలక సిఫార్సులు చేయనుంది.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయనుందని అధికారులు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.