మరోసారి గుండ్రెడ్డిపల్లిలో కంటపడిన చిరుత

 

మరోసారి గుండ్రెడ్డిపల్లిలో కంటపడిన చిరుత

మెదక్ జిల్లా, తూప్రాన్ : అక్టోబర్ 29: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో మళ్లీ చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే — గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చిరుత పులి కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు.

గత నెలాఖరులో కూడా ఇదే ప్రాంతంలో చిరుత సంచారం నమోదై భయాందోళనకు గురైన ప్రజలు, మళ్లీ రెండోసారి చిరుత దర్శనంతో మరింత ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా గుట్టపై తిరుగుతున్న చిరుతను పలువురు గ్రామస్తులు చూసినట్లు చెప్పారు.

దీంతో అటవీ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని, గ్రామ ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.