జెన్కో సిబ్బందికి శుభవార్త.. వివిధ సమస్యల పరిష్కారంపై చర్యలు త్వరలో!
హైదరాబాద్, అక్టోబర్ 14: TEE1104 యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాయిబాబు గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ (HR) వి. కుమార్ రాజ్ గారిని కలసి పలు కీలక అంశాలపై చర్చించారు.
👉 జెపిఎ నుండి జూనియర్ అసిస్టెంట్ కన్వర్షన్:
జెన్కోలో థర్మల్, హైడల్ స్టేషన్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న JPA to Junior Assistant కన్వర్షన్ స్క్రీనింగ్ టెస్ట్ విషయాన్ని ప్రస్తావించగా, డైరెక్టర్ (HR) సంబంధిత విభాగాలతో మాట్లాడి ఫైల్‌ను ట్రాన్స్‌కో వారికి పంపించినట్లు తెలిపారు. స్క్రీనింగ్ టెస్ట్‌ను త్వరలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
👉 KTPPలో యూనియన్ ఆఫీస్ భవనం ఏర్పాటు & G టైప్ క్వార్టర్స్ వారికి HRA:
ఈ అంశాలపై సాయిబాబు గారు ప్రస్తావించగా, డైరెక్టర్ (HR) సానుకూలంగా స్పందించారు.
👉 KTPS-O&M స్థానంలో 2x800MW ఏర్పాటు:
ఈ అంశంపై కూడా చర్చించగా, డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు.
👉 KTPS-VII స్టేజ్‌లో క్వార్టర్స్ హ్యాండ్ ఓవర్ చేసిన వారికి తిరిగి HRA:
డైరెక్టర్ దీనిపై కూడా సానుకూలంగా స్పందించి, త్వరలో HRA కల్పిస్తామని తెలిపారు.
👉 YTPS షిఫ్ట్ వర్కర్లకు షిఫ్ట్ అలవెన్స్:
షిఫ్టుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు షిఫ్ట్ అలవెన్సులు ఇవ్వాలని కోరగా, డైరెక్టర్ (HR) సంబంధిత చీఫ్ ఇంజినీర్‌తో మాట్లాడి త్వరలో ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్, జెన్కో ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, సభ్యులు రవి, దేవ్లా, కేటీపీఎస్ 5 & 6వ దశ వంశీ (శ్రీశైలం) పాల్గొన్నారు.

Post a Comment