దస్తగిరి బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు లోతువాగు గ్రామంలో భక్తుల సందడి

దస్తగిరి బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు లోతువాగు గ్రామంలో భక్తుల సందడి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 15: లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రసిద్ధ దర్గా దస్తగిరి బాబా ఉర్సు ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను సయ్యద్ చాంద్ బి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఉర్సు సందర్భంగా దర్గా పరిసరాలు దీపాలంకరణలతో కాంతులీనగా మారగా, భక్తుల తాకిడి రోజు మొత్తం కనిపించింది. మొదటగా ఫాతెహా నిర్వహించిన అనంతరం దర్గా నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మొహమ్మద్ ఇబ్రాహీం, మొహమ్మద్ ఖాదర్, మొహమ్మద్ ఫరీద్, మొహమ్మద్ తాజుద్దీన్, మొహమ్మద్ వలి బాబా, మొహమ్మద్ అజీమ్, మొహమ్మద్ అల్తాఫ్,   మొహ్మద్ అఫ్సర్, మొహమ్మద్ యాకూబ్, మొహమ్మద్ జమాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక మత పెద్దలు, మహిళలు, పిల్లలు, దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దస్తగిరి బాబా ఆశీర్వచనాలు పొందారు.

దర్గా ప్రాంగణంలో ఆధ్యాత్మిక గీతాలు, ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థన సమయాలు నిర్వహించగా, భక్తులలో భక్తి ఉత్సాహం అలుముకుంది. నిర్వాహకులు ఉత్సవ విజయవంతానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.