నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ

నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ

పాల్వంచ, అక్టోబర్ 25 : నవ లిమిటెడ్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల భాగంగా నిర్వహిస్తున్న నవ మహిళా సాధికార కేంద్రంలో తాటి ఆకుల కళాకృతులు విక్రయించి వచ్చిన రూ.1,35,700 నగదును మహిళలకు చెక్కుల రూపంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ (CSR) ఎం.జి.ఎం. ప్రసాద్, జనరల్ మేనేజర్ (పవర్ ప్లాంట్) ఆర్.పి. కిరణ్ పాల్గొని చెక్కులను మహిళలకు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎం.జి.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ “మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుంది. మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగితే ఆ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందమయంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.