వక్ఫ్ ఆస్తులను తక్షణమే 'ఉమీద్' పోర్టల్‌లో నమోదు చేయాలి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ

వక్ఫ్ ఆస్తులను తక్షణమే 'ఉమీద్' పోర్టల్‌లో నమోదు చేయాలి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ

జమాతే ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్ ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ 


టెమ్రీస్ కౌన్సిలర్ – హింద్ మజ్దూర్ సభ (HMS) జాతీయ కార్యదర్శి విజ్ఞప్తి

వక్ఫ్ ఆస్తుల రక్షణకు అడుగులు – మిల్లీ సంస్థలు క్రియాశీలం కావాలని పిలుపు

హైదరాబాద్–గోదావరిఖని–న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ముస్లిం మిల్లీ (సామాజిక) సంస్థలు, వక్ఫ్ ఆస్తుల ధర్మకర్తలు, మసీదులు మరియు మదరసాల నిర్వాహకులు తమ ఆస్తులను తక్షణమే ‘ఉమీద్’ (UMID – Unique Missionary ID) పోర్టల్ లో నమోదు చేయాలని జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ విజ్ఞప్తి చేశారు.

వక్ఫ్ ఆస్తుల రక్షణకు ఈ ప్రక్రియ అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొంటూ — “వక్ఫ్ ఆస్తులు, మసీదులు, మదరసాలు, దర్గాలు, ఖబ్రస్తాన్లు మరియు ఇతర ఆస్తులను పోర్టల్‌లో నమోదు చేయించడం ద్వారా వాటికి చట్టపరమైన రక్షణ లభిస్తుంది,” అన్నారు.

ముఖ్యంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందని ఆయన చెప్పారు.

“అన్ని మిల్లీ సంస్థలు, సంఘాలు, మతపరమైన సంస్థల బాధ్యులు ఈ క్లిష్టమైన సమస్యపై చురుకుగా వ్యవహరించాలి. వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలు, అన్యాక్రాంతం వంటి సమస్యలు పెరుగుతున్న ఈ సమయంలో, గ్రామీణ మరియు జిల్లా స్థాయిలో వాటి రక్షణకు ప్రత్యేక దృష్టి అవసరం,” అని ఖాజీ నిజామీ గారు పేర్కొన్నారు.

అలాగే ఆయన మరింతగా సూచిస్తూ, “సమాజంలోని ప్రతి వ్యక్తి ముందుకు వచ్చి, ధర్మకర్తలకు మార్గనిర్దేశం చేయాలి. ‘ఉమీద్’ పోర్టల్లో నమోదు సమయంలో సమస్యలు ఎదురైతే, వక్ఫ్ బోర్డు అధికారులను సంప్రదించి వెంటనే పరిష్కరించుకోవాలి,” అని అన్నారు.

వక్ఫ్ ఆస్తుల రక్షణ అనేది జాతి ఆస్తిని కాపాడటం లాంటిదని, దీనిని ప్రతి ముస్లిం తన సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.