కరెంట్ స్తంభాలు పాతబడి పగుళ్లు ఏర్పడిన పట్టించుకొని విద్యుత్ అధికారులు

కరెంట్ స్తంభాలు పాతబడి పగుళ్లు ఏర్పడిన పట్టించుకొని విద్యుత్ అధికారులు


భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు, రైటర్ బస్తి గొల్లగూడెం ప్రాంత ప్రజలు సంవత్సరాలుగా విద్యుత్ స్తంభాల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.

స్థానిక నివాసి పొన్నెకంటి సంజీవరాజు తెలిపిన వివరాల ప్రకారం, ఇంటి నంబర్లు 8-1-173, 8-1-174 వద్ద నివసిస్తున్న వారు గత 57 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారని, 1983-84 సంవత్సరంలో విద్యుత్ కనెక్షన్లు మొదటగా ఇవ్వబడినప్పుడు ఏర్పాటు చేసిన కరెంటు స్తంభాలు ఇప్పటికీ మార్పు లేకుండా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ స్తంభాలు పాతబడి పగుళ్లు ఏర్పడి ఎప్పుడైనా విరిగిపడే ప్రమాదం ఉన్నదని తెలిపారు. అంతేకాకుండా, స్తంభాలు నిబంధనలకు విరుద్ధంగా చాలా దూరంలో ఉండటంతో చెట్ల కొమ్మలు సర్వీస్ వైర్లపై పడుతూ, తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి వినతులు సమర్పించినప్పటికీ స్పందన రాకపోవడం విచారకరమని సంజీవరాజు తెలిపారు.

స్థానికులు విద్యుత్ శాఖను కోరుతూ, గృహాల సమీపంలో కొత్త కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసి, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.