9 అడుగుల భారీ కొండ చిలువను బంధించిన ప్రాణధార ట్రస్ట్
చుంచుపల్లి, అక్టోబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ క్లబ్ ఏరియాలో బుధవారం రాత్రి సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. మోజేస్ ఇంట్లోకి సుమారు 9 అడుగుల పొడవైన కొండచిలువ (ఇండియన్ రాక్ పైథాన్) చొరబడి కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే ప్రాణధార ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ మొబైల్ +91 94915 43291, సహచరుడు నారదాసు శ్రీకాంత్ (చోటు) తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా ఆ కొండచిలువను సురక్షితంగా బంధించారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఆ పైథాన్‌ను అదే రాత్రి సమీప అటవీ ప్రాంతంలో విడుదల చేశారు.
ఈ స్నేక్ రెస్క్యూ ఆపరేషన్‌లో సంతోష్‌తో పాటు శ్రీకాంత్ (చోటు), మదర్ తెరాస సేవా సంస్థ అధ్యక్షుడు గుడెల్లి యాకయ్య, బండ శంకర్, మురళి, శ్రీనివాస్, ఎంఢీ సలీం, తరుణ్, అలాగే అటవీ విభాగానికి చెందిన FRO శ్రీనివాస్, FBO, DRO సిబ్బంది పాల్గొన్నారు.
స్థానికులు ప్రాణధార ట్రస్ట్ సభ్యుల వేగవంతమైన స్పందనను ప్రశంసించారు.

Post a Comment