మస్జిద్-ఎ–పంజేతన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా

 

మస్జిద్-ఎ–పంజేతన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా

మస్జిద్-ఎ–పంజేతన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం: చుంచుపల్లి మండలంలోని వెంకటేశ్వర కాలనీలో మస్జిద్ – ఎ – పంజేతన్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఖాన్ఖాయే గరీబ్ నవాజ్ దర్గా దర్భార్‌ ఖాదీమ్ సయ్యద్ ఫకీరు అహ్మద్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టనున్న ఈ మస్జిద్‌కు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా మతాచారప్రకారం ఫాతెహా పఠనంతో శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సాబిర్ పాషా మాట్లాడుతూ మత సౌహార్దం, సమాజ అభివృద్ధి దిశగా మస్జిద్‌లు, దర్గాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, శాంతి, ప్రేమ స్ఫూర్తిని మస్జిద్‌లు పెంపొందిస్తాయని ఆయన అన్నారు. ఈ మస్జిద్ నిర్మాణం స్థానిక ముస్లిం భక్తులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దర్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, అనంతరం మతపరమైన సాంప్రదాయాల ప్రకారం సమూహ ఫాతెహా పఠనం జరిగింది.

ఈ కార్యక్రమం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో సాగగా, మస్జిద్ నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా స్థానికులు శ్రమించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.