రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతి


హైదరాబాద్‌, అక్టోబర్ 14 (ప్రతినిధి) : హైదరాబాద్‌లో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన బీటెక్ విద్యార్థిని మృతి చెందింది. వివరాల ప్రకారం, సిరిసిల్ల సుభాష్‌నగర్‌కు చెందిన బండారి అశోక్, గీత దంపతుల చిన్నకూతురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.

శనివారం వనస్థలిపురంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతిచెందింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.