భారత ప్రధాన న్యాయమూర్తి గవాయి పై దాడికి జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నిరసన
కొత్తగూడెం, లీగల్ న్యూస్: భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. గవాయి పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమం సంఘ అధ్యక్షుడు రామిశెట్టి రమేష్ విజ్ఞప్తి మేరకు నిర్వహించబడగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అనుమతి ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సంఘ నాయకులు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీయడానికి చేసే యత్నాలను కఠినంగా ఖండిస్తూ, ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చగానూ, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ దికొండ రవికుమార్, ట్రెజరర్ లగడపాటి సురేష్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ వాసం రమేష్, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ నిమ్మల మల్లికార్జున్, వైస్ ప్రెసిడెంట్లు మీనా కుమారి, ప్రమీల, ఇ.కృష్ణకుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలు హెచ్.సత్యనారాయణ, బి.మారీశ్వరరావు, ఎం.స్వామినాథం, లేడీ రిప్రజెంటిటివ్ ఎం.యాద రమణ, స్పోర్ట్స్ సెక్రటరీ సిద్ధార్థ శంకర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు.
వీరు న్యాయవ్యవస్థ రక్షణకు, న్యాయమూర్తుల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Post a Comment