చీరాలలో విషాదం సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
బాపట్ల జిల్లా, చీరాలు – అక్టోబర్ 12: చీరాల సముద్రతీరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సేదతీరేందుకు బీచ్‌కు వచ్చిన యువకుల సమూహం సముద్ర స్నానానికి వెళ్లగా, అలల తాకిడికి ఎనిమిది మంది లోపలికి కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగా, మిగిలిన ఐదుగురు దురదృష్టవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో చీరాల బీచ్ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మరోవైపు మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ప్రమాదం తలపించిన ఘటనలో కానిస్టేబుళ్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ధైర్యసాహసం ప్రదర్శించారు. కపిలేశ్వరానికి చెందిన అబ్దుల్ ఆసిఫ్, ఎస్‌కే ఆర్ఫాద్, ఎస్‌కే సికిందర్, షరీఫ్ ఆదివారం ఉదయం బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ఉధృతికి కొట్టుకుపోయారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లు నాంచారయ్య, శేఖర్ చాకచక్యంగా సముద్రంలోకి దూకి నలుగురినీ రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.
ప్రజలు బీచ్‌లకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని, రెడ్ ఫ్లాగ్ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Post a Comment