నవంబర్ 10 చివరి కార్తీక సోమవారం కార్తీక మాసం నవంబర్ 20న అమావాస్యతో ముగియనుంది

 

నవంబర్ 10 చివరి కార్తీక సోమవారం కార్తీక మాసం నవంబర్ 20న అమావాస్యతో ముగియనుంది

నవంబర్ 08: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసం అన్ని మాసాలలో ప్రత్యేకమైనది. ఈ నెలలో భక్తులు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. ప్రతి రోజు తెల్లవారుజామునే కార్తీక స్నానం చేసి, దీపం వెలిగించడం ఆనవాయితీగా కొనసాగుతుంది.

అక్టోబర్ 22న ప్రారంభమైన కార్తీక మాసం నవంబర్ 20న అమావాస్యతో ముగియనుంది. ఇప్పటివరకు రెండు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి ముగిశాయి. ఇక నవంబర్ 10న మూడవ, అంటే చివరి కార్తీక సోమవారం జరగనుంది.

పురాణాల ప్రకారం, ఈ మూడవ సోమవారంలో విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్లి, పార్వతీ పరమేశ్వరుల ఆహ్వానాన్ని స్వీకరిస్తాడట. ఈ రోజు చేసే పూజలు, వ్రతాలు, దానాల ద్వారా విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడని, శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.