ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు


మెదక్, మనోహరాబాద్, నవంబర్ 8: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు విశేషంగా జరిగాయి. ఈ వేడుకలను కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ చిట్కూల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరై, సభలో పాల్గొన్న నాయకులు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వేదికపై పుట్టినరోజు కేక్ కట్ చేసి, పరస్పరం నోరుతీపి చేసుకున్నారు.

ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి దంపతులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా గ్రామంలోని మహిళలకు టిఫిన్ బాక్స్‌లు పంపిణీ చేశారు. అలాగే ప్రతి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అవసరమైన వస్తువులు అందజేస్తామని, నీటి సమస్యలు ఉన్న గ్రామాల్లో బోర్లు వేయించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మహిపాల్ రెడ్డి పేర్కొంటూ, “లక్ష్మీ రాం రెడ్డి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తాం” అన్నారు.

ఈ వేడుకల్లో గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, వెంకట్ రెడ్డి, పంజా బిక్షపతి, జావేద్ పాషా, ఆదిల్, ఆడెపు మహేందర్, రింకు రెడ్డి, పలు గ్రామాల మాజీ సర్పంచులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.