ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్, నవంబర్ 8: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, అభిమానులు ముఖ్యమంత్రిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, పీసీసీ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రముఖులు ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.