తూప్రాన్ ఆయుర్వేద ఆసుపత్రిలో “వందే మాతరం” 150 ఏళ్ల వేడుకలు
తూప్రాన్, నవంబర్ 7 : మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఆయుర్వేద ఆసుపత్రిలో వందే మాతరం గీతం 150 ఏళ్ల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా. సచిన్ చంద్ర మాట్లాడుతూ,“వందే మాతరం స్వాతంత్ర్య పోరాట కాలంలో భారతీయులలో దేశభక్తి స్పూర్తిని రగిలించిన గీతం. ఇది మన స్వాతంత్ర్య ఉద్యమానికి మనోబలం ఇచ్చిన శబ్ద తరంగం” అని తెలిపారు.
బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన వందే మాతరం గీతం 1875 నవంబర్ 7న రచించబడిందని, 1882లో ఆయన రచించిన ఆనందమఠ్ నవలలో మొదటిసారిగా ప్రచురితమైందని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం దీన్ని జాతీయ గేయంగా స్వీకరించిందని గుర్తుచేశారు.
కార్యక్రమంలో డా. ప్రవీణ్ కుమార్, ఫార్మసిస్ట్ సౌజన్య, సిబ్బంది వెంకటరమణ, సుష్మా, పి.హెచ్.సి ఎ.ఎన్.ఎం శ్యామల, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment