స్టేట్ కళా ఉత్సవ్‌–2025లో సత్తా చాటిన గిన్నారపు సేవిత శ్రీ వైష్ణవి

స్టేట్ కళా ఉత్సవ్‌–2025లో సత్తా చాటిన గిన్నారపు సేవిత శ్రీ వైష్ణవి

స్టేట్ స్థాయి సింగింగ్‌ పోటీల్లో ద్వితీయ స్థానం

హైదరాబాద్‌, నవంబర్‌ 7 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన గిన్నారపు సేవిత శ్రీ వైష్ణవి స్టేట్ స్థాయి కళా ఉత్సవ్‌–2025లో తన గాత్ర ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంది. రాజేంద్రనగర్‌లో జరిగిన స్టేట్ లెవల్ సింగింగ్‌ కాంపిటీషన్‌లో రెండవ స్థానం సాధించి, జిల్లా గౌరవాన్ని పెంచింది.

పాల్వంచలోని నవభారత్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న సేవిత శ్రీ వైష్ణవి, గత నెలలో కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్‌ సింగింగ్‌ పోటీల్లో మొదటి స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. రాష్ట్రస్థాయి పోటీల్లో వైష్ణవి అద్భుత గాన ప్రతిభ కనబర్చగా, జడ్జీలు మరియు ప్రేక్షకులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ సందర్భంగా స్టేట్ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌, రాధా రెడ్డి చేతులమీదుగా ఆమెకు మెమెంటో, సర్టిఫికేట్ అందజేశారు.

తల్లిదండ్రులు గిన్నారపు నాగేందర్‌, అంబికా మాట్లాడుతూ వైష్ణవి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం మాకు గర్వకారణం. ఆమె పాటల్లో మాత్రమే కాదు, చదువులో కూడా ఎప్పుడూ మొదటి ర్యాంక్‌ సాధిస్తుంది. భవిష్యత్తులో అన్ని రంగాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం” అన్నారు.

నవభారత్‌ స్కూల్‌ యాజమాన్యం కూడా వైష్ణవిని అభినందిస్తూ “విద్యార్థినులందరికీ వైష్ణవి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.