10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి


మహబూబాబాద్ జిల్లా, నవంబర్ 6: రైతు భీమా పరిహార దస్తావేజును ప్రాసెస్ చేసి, ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించేందుకు ఫిర్యాదుదారుని నుంచి లంచం రూపంలో రూ.10,000/- స్వీకరిస్తూ వ్యవసాయ విస్తరణాధికారి ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే — మర్రిపెడ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారి జి. సందీప్, ఫిర్యాదుదారుని తండ్రి రైతు భీమా పరిహార పత్రాల ప్రాసెసింగ్‌ కోసం లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ అవినీతినిరోధకశాఖ (ACB) అధికారులు పన్నాగం పన్ని, నేడు నిర్వహించిన దాడిలో సందీప్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రజలకు ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేస్తూ తెలిపారు “ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన పక్షంలో వెంటనే తెలంగాణ అవినీతినిరోధకశాఖను సంప్రదించండి. టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయవచ్చు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్‌సైట్‌ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి” అని పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.