భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో కోర్టులో సమీక్ష సమావేశం

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో కోర్టులో సమీక్ష సమావేశం

కొత్తగూడెం లీగల్ :: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో గురువారం జిల్లా అధికారులతో న్యాయమూర్తులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టుల వారీగా సాక్షులను త్వరితగతిన హాజరు పరచి, స్పీడు డిస్పోజల్‌కు సహకరించాలని కోరారు. వారంట్ పెండింగ్‌లో ఉన్న కేసులలో వారంట్‌లను తక్షణమే అమలు చేయాలని, ముఖ్యంగా చెక్కు బౌన్స్ కేసులలో ఫిర్యాదుదారుల సహకారంతో చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో ఇల్లందు, మణుగూరు కోర్టు కాంపౌండ్‌లు పరిశీలించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను సూచించారు.

మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత మాట్లాడుతూ ప్రత్యేకంగా పోక్సో కేసులలో సాక్ష్యాలను వెంట వెంటనే తీసుకురావడంలో పోలీసు అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ సెక్రటరీ ఎం. రాజేందర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కే. కిరణ్ కుమార్, మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే. సాయి శ్రీ, ఎస్‌.పి. బిరుదు రాజు రోహిత్ రాజు, జాయింట్ కలెక్టర్ డి. వేణుగోపాల్, భద్రాచలం ఏఎస్‌పీ విక్రాంత్, డీసీఆర్బీ డీఎస్పీ ఎం. మల్లయ్య స్వామి, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు, ఎక్సైజ్ డీఎస్పీ, ఫారెస్ట్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ సుజాత, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్‌.పి. బిరుదు రాజు రోహిత్ రాజుతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, సెప్టెంబర్ 13న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించిన ధర్మిలా కోర్టు కానిస్టేబుల్‌లు, కోర్టు లైజాన్ ఆఫీసర్లుకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.