50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌


ములుగు రక్షక భట నిలయానికి చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సిహెచ్‌. విజయ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) రాజు లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతిలో చిక్కారు.

ఫిర్యాదుదారుడి సోదరికి సంబంధించిన ఒక నివాసయోగ్యమైన ఆస్తి ఎవిక్షన్‌ ప్రక్రియలో ఆమెను హక్కుదారుగా ఉంచే విధంగా ఇతర శాఖ అధికారులకు సహాయం చేయడానికి, అలాగే ఫిర్యాదుదారుడు ములుగు రక్షకభట నిలయంలో ఇచ్చిన ఫిర్యాదులో సహాయం చేసినందుకు గాను, వారు రూ. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ప్రస్తుతం ఎస్సై విజయ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ రాజు లను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ప్రజలకు హెచ్చరిక:
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ను సంప్రదించవచ్చును.

  • టోల్‌ఫ్రీ నంబర్‌: 1064
  • వాట్సాప్‌: 9440446106
  • ఫేస్‌బుక్‌: Telangana ACB
  • ఎక్స్‌ (Twitter): @TelanganaACB
  • వెబ్‌సైట్‌: acb.telangana.gov.in

ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.