అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 12 నుండి 19 వరకు జరుగుతున్న వయోవృద్ధుల వారోత్సవాల భాగంగా, నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) విద్యా చందన, జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా సంయుక్తంగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ అన్ని లైన్‌ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ వారోత్సవాలలో చురుకుగా పాల్గొని వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు.

జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా మాట్లాడుతూ, “నేటి సమాజంలో వృద్ధులు సరైన ఆదరణ పొందడం లేదని, కొంతమంది కుటుంబ సభ్యులు వారిని నిర్లక్ష్యం చేస్తూ హింసిస్తున్నారని” ఆవేదన వ్యక్తం చేశారు. వయోవృద్ధులకు చట్టబద్ధమైన హక్కులు, రక్షణలపై గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు ఈ వారంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సైదులు, సీనియర్ సిటిజన్స్ సభ్యులు నాగేశ్వరరావు, సందీప్, బ్రహ్మకుమారి మహేశ్వరి, సిడిపివోలు పద్మ, లక్ష్మీ ప్రసన్న, కార్యాలయ సిబ్బంది వరప్రసాద్, నరేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.