58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళలకు ముగ్గుల పోటీ, గోరింటాకు పోటీలలు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జాతీయ మహిళా కార్యక్రమం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు
58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతీయ మహిళా కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ముగ్గుల పోటీ, గోరింటాకు పోటీలను నిర్వహించగా, మహిళలు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెల్లా అరుణ, సేఫ్టీ ఉమెన్స్ సబ్‌ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,“ఈరోజు సమాజంలో మహిళల భద్రత అత్యంత కీలకం. చిన్న పిల్లల నుంచి పెద్ద మహిళల వరకు ప్రతి ఒక్కరూ తమ రక్షణ కోసం ధైర్యంగా ముందుకు రావాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్ మహిళలకు ఎల్లప్పుడూ భరోసాగా నిలుస్తుంది. మహిళ ఒకరు చదివితే కుటుంబంతో పాటు సమాజం కూడా ఎదుగుతుంది. ప్రతి రంగంలో మహిళలు రాణించాలని ఆశిస్తున్నాను” అని సూచించారు.
ముగ్గుల పోటీలో న్యాయనిర్ణేతగా చించిపెళ్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సబిత వ్యవహరించారు. గోరింటాకు అందంగా వేసిన విజేతలను ఆమె ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు మణి మృదుల, గ్రంథపాలకులు మధుబాబు, రుక్మిణి, గ్రంథాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తదనంతరం 108వ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు.

Post a Comment