అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న పోలీసులు

 

అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్న పోలీసులు

మెదక్ జిల్లా, తూప్రాన్ – నవంబర్ 2: తూప్రాన్ మండలంలోని నాగులపల్లి చౌరస్తా పరిసరాల్లో రాత్రి వేళల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న సమాచారం ఆధారంగా పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మూడు టిప్పర్లు, ఒక జెసిబీని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా తూప్రాన్ ఎస్సై శివానందం మాట్లాడుతూ  “రాత్రి వేళల్లో అక్రమంగా మట్టి తరలించే వారిని ఎవ్వరినీ ఉపేక్షించం. సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.

పోలీసులు ఈ ఘటనపై కేసులు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.