డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రత్యేక తనిఖీలు – మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై చర్యలు

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రత్యేక తనిఖీలు – మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై చర్యలు


మెదక్ పట్టణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై ఏఎస్‌ఐ రుక్సానా నేతృత్వంలో బ్రీత్‌ అనలైజర్ పరీక్షలు చేపట్టారు. ఈ తనిఖీలలో పలువురు మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించి, వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా ఏఎస్‌ఐ రుక్సానా మాట్లాడుతూ, “మద్యం సేవించి వాహనం నడపడం తీవ్ర నేరం. ఇది డ్రైవర్‌ ప్రాణానికే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. చట్టాలను గౌరవించి, మద్యం సేవించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపకూడదు” అని హెచ్చరించారు.

ప్రజల భద్రత కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తరచుగా నిర్వహిస్తామని, ఈ చర్యలు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికే ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.