ఊరి చివర గుడిసెలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ఊరి చివర గుడిసెలో వ్యక్తి అనుమానాస్పద మృతి

మనోహరాబాద్‌, నవంబర్‌ 10 (ప్రతినిధి): మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే — గ్రామం చివర గల గుడిసెలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. ఉదయం యజమాని గుడిసెకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుభాష్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన రామ్ చరణ్‌గా గుర్తించారు. ఆయన కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరణానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.