అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పలు సంఘాల నాయకులు
మాసాయిపేట, మెదక్ : నవంబర్ 10: తెలంగాణ రాష్ట్ర కవి, ఉద్యమకారుడు, సాహితీవేత్త అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు అని అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చిన్నరాం లక్ష్మణ్ పేర్కొన్నారు.
అందెశ్రీ గారి ఆకస్మిక మరణ వార్త తమను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాదగిరి మాదిగ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ సాహితీ లోకంలో ఒక మహానుభావుడిని, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కవిని కోల్పోయాం. ‘జయ జయహే తెలంగాణ’ పాట ద్వారా తెలంగాణ చరిత్రను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసిన అందెశ్రీ గారి సేవలు మరువలేనివి. రాష్ట్ర అవతరణలో ఆయన పాత్ర అత్యంత కీలకమైంది,” అని అభిప్రాయపడ్డారు.
అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆయన కుటుంబ సభ్యులకు రజక సంఘం గుల్లపల్లి బాబు, అంజనీపుత్ర యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడ్డి చిన్న రమేష్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Post a Comment