పాఠశాలలకు రెండు రోజులు16 17 సెలవులు
హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎల్లుండి జరగనున్న నేపథ్యంలో పలు పరిపాలనా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో విడతలో భాగంగా మొత్తం 4,158 సర్పంచ్, 36,434 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, ఇందులో ఇప్పటికే 394 సర్పంచ్ మరియు 7,916 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా నిర్ణయమయ్యాయి.
మిగిలిన స్థానాలకు బుధవారం ఉదయం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు రేపు (మంగళవారం), ఎల్లుండి (బుధవారం) రెండు రోజులు సెలవులు ప్రకటించారు.
అలాగే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు కల్పించనున్నారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ఈరోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేపటి నుంచి పోలింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించనున్నారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Post a Comment