అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన మామ… ఆ ఒక్క ఓటు తేడాతో గెలిచిన కోడలు
నిర్మల్ జిల్లా ప్రతినిధి | డిసెంబర్ 15: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరితమైన ఫలితం నమోదైంది. ఒక్క ఓటు తేడాతో ముత్యాల శ్రీవేద విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
శ్రీవేద ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలుసుకున్న ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికాలో నివసిస్తున్నారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందే స్వగ్రామానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఒక్క ఓటే చివరకు గెలుపును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించడం విశేషం.
గ్రామంలో మొత్తం 426 ఓట్లు ఉండగా, వాటిలో 378 ఓట్లు పోలయ్యాయి. లెక్కింపులో ముత్యాల శ్రీవేదకు 189 ఓట్లు రాగా, ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ఓటు చెల్లనిదిగా ప్రకటించారు. దీంతో ఒక్క ఓటు ఆధిక్యంతో శ్రీవేద విజయం సాధించారు.
ఈ ఘటన గ్రామంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎంత కీలకమో మరోసారి రుజువైన సంఘటనగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment