మందమర్రి: సింగరేణి దినోత్సవ వేడుకలకు ఘన ఏర్పాట్లు చేయాలని జిఎం ఆదేశాలు

మందమర్రి: సింగరేణి దినోత్సవ వేడుకలకు ఘన ఏర్పాట్లు చేయాలని జిఎం ఆదేశాలు


డిసెంబర్ 11, 2025 – మందమర్రి: సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 23న మందమర్రి ఏరియాలో భారీ ఎత్తున నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఏరియా జ‌నర‌ల్ మేనేజర్ రాధాకృష్ణ అధికారులకు స్పష్టం చేశారు.

గురువారం జిఎం కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకల్లో సింగరేణి కంపెనీ కార్యకలాపాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే ప్రత్యేక స్టాల్స్, అలాగే వివిధ రకాల ఆహార స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సింగరేణి ప్రతిష్ఠకు తగ్గట్టుగా దినోత్సవాన్ని నిర్వహించి, ఉద్యోగులు మరియు ప్రజలందరికీ గుర్తుండిపోయేలా కార్యక్రమాలు ఉండాలని జిఎం సూచించారు. వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తిచేసి, ఎలాంటి లోపాలు లేకుండా పనిచేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.