ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఆటో స్క్రోల్ ఫీచర్ పరీక్షలు రీల్స్ వీక్షణలో కీలక మార్పులు

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఆటో స్క్రోల్ ఫీచర్ పరీక్షలు రీల్స్ వీక్షణలో కీలక మార్పులు


న్యూఢిల్లీ: వినియోగదారుల అనుభవాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. తాజాగా తీసుకొచ్చిన ఆటో స్క్రోల్ ఫీచర్ ద్వారా రీల్స్ చూడే విధానంలో మార్పు రానుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, యూజర్లు స్క్రీన్‌ను టచ్ చేయకుండానే రీల్స్ స్వయంచాలకంగా మారతాయి. ఒక రీల్ పూర్తయ్యిన వెంటనే తదుపరి రీల్ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుంది. దీంతో ఎక్కువసేపు రీల్స్ వీక్షించే వారికి ఇది మరింత సౌకర్యంగా ఉండనుంది.

అయితే, ఈ ఆటో స్క్రోల్ ఫీచర్ కారణంగా వినియోగదారులు సోషల్ మీడియాలో గడిపే సమయం ఇంకా పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది డిజిటల్ అలవాట్లపై ప్రభావం చూపే అంశంగా మారవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఎంపిక చేసిన ఖాతాల్లో మాత్రమే పరీక్షాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. వినియోగదారుల స్పందనను బట్టి త్వరలోనే అందరికీ విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.