ప్రశాంతంగా పూర్తి అయిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, నిబంధనల మేరకు జిల్లాలో నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగా చేపట్టిన విస్తృత ఏర్పాట్లు, భద్రతా చర్యల కారణంగా పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ మూడో విడత ఎన్నికలలో భాగంగా జిల్లాలోని అల్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతానగర్, టేకులపల్లి, యెల్లందు మండలాలలో పోలింగ్ నిర్వహించబడింది. జిల్లాలో మొత్తం 1,75,074 మంది ఓటర్లు నమోదు కాగా, పోలింగ్ ముగిసే సమయానికి 1,48,230 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తం 84.67 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
పోలింగ్ ప్రారంభమైన ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు హాజరయ్యారని తెలిపారు.
- ఉదయం 9.00 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 37,231 ఓట్లు పోలవగా ఇది 21.27 శాతం పోలింగ్‌గా నమోదైంది.
- ఉదయం 11.00 గంటల వరకు 1,09,155 ఓట్లు పోలై 62.35 శాతం పోలింగ్ నమోదైంది.
- మధ్యాహ్నం 1.00 గంటల వరకు మొత్తం 1,41,176 ఓట్లు పోలై 80.64 శాతం పోలింగ్ నమోదైంది.
- క్లోజ్ ఆఫ్ పోలింగ్ సమయానికి మొత్తం 1,48,230 ఓట్లు పోలై 84.67 శాతం పోలింగ్‌తో ఎన్నికలు ముగిశాయని కలెక్టర్ వివరించారు.
మండలాల వారీగా పోలింగ్ శాతం ఈ విధంగా నమోదైందని ఆయన తెలిపారు:
- అల్లపల్లి – 88.09%
- గుండాల – 86.25%
- జూలూరుపాడు – 88.71%
- లక్ష్మీదేవిపల్లి – 80.86%
- సుజాతానగర్ –

Post a Comment