గన్ కాల్పుల కలకలం లారీ డ్రైవర్‌ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చి హతమార్చిన దుండగులు

 

గన్ కాల్పుల కలకలం లారీ డ్రైవర్‌ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చి హతమార్చిన దుండగులు

నిజామాబాద్, ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండల పరిధిలో గన్ కాల్పులు కలకలం సృష్టించాయి. దేవి తాండ సమీపంలోని నేషనల్ హైవే–44పై ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ను దుండగులు పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చి హత్య చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సల్మాన్ అనే లారీ డ్రైవర్ తన వాహనాన్ని దేవి తాండ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద నిలిపి ఉంచాడు. అదే సమయంలో వేరే లారీలో అక్కడికి వచ్చిన ముగ్గురు దుండగులు, ఎలాంటి మాటా మాటా లేకుండా సల్మాన్‌పై గన్‌తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

హత్య అనంతరం దుండగులు సల్మాన్ లారీనే తీసుకుని చంద్రయాన్‌పల్లి వరకు వెళ్లి, అక్కడ ఉన్న ఓ దాబా వద్ద వాహనాన్ని వదిలివేసి, సమీపంలోని అడవిలోకి పరారయ్యారు.

ఈ ఘటనతో నేషనల్ హైవే–44పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

గన్ కాల్పుల వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.