పిల్లల ముందే భార్యను పెట్రోల్‌తో కాల్చి హత్య చేసిన భర్త – కూతురిపై కూడా దాడి
హైదరాబాద్, నల్లకుంట: నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన నగరాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య ఏర్పడిన అనుమానాలు చివరికి హత్యకు దారి తీశాయి.
నల్గొండ జిల్లా చెందిన త్రివేణి, వెంకటేష్ దంపతి ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్యపై అనుమానాలు పెంచుకున్న వెంకటేష్, ఆమెను వేధింపులకు గురి చేయడంతో త్రివేణి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల ఆమెను తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఘోరానికి పాల్పడ్డాడు.
పిల్లల ముందే త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వెంకటేష్, అడ్డుకోవడానికి ప్రయత్నించిన కూతురిని కూడా మంటల్లోకి తోసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే త్రివేణి మృతి చెందగా, కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు, 12 గంటల్లోనే నిందితుడు వెంకటేష్‌ను అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
➡️ ఈ సంఘటన డొమెస్టిక్ వైలెన్స్ ఎంత ప్రమాదకరమో మరోసారి హెచ్చరిస్తోంది.

Post a Comment