ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో హుస్సేన్‌కు ఉత్తమ రాజకీయ నాయకుడు అవార్డు

 

ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో హుస్సేన్‌కు ఉత్తమ రాజకీయ నాయకుడు అవార్డు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నల గద్దర్ చేతులమీదుగా ప్రదానం

భద్రాద్రి కొత్తగూడెం | డిసెంబర్ 25 : తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం 12వ వార్షికోత్సవాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పరిరక్షణకు విశేష సేవలు అందించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హుస్సేన్‌కు ఉత్తమ రాజకీయ నాయకుడు అవార్డును ప్రదానం చేశారు.

ఈ అవార్డును వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నల గద్దర్ సంయుక్తంగా హుస్సేన్‌కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, వికలాంగుల సంక్షేమం, హక్కుల సాధన కోసం హుస్సేన్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో వికలాంగులకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు.

అవార్డు అందుకున్న హుస్సేన్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. భవిష్యత్తులో కూడా వికలాంగుల హక్కుల సాధనకు, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్, మెరుగు శివ, ఉమీర్ ఖాన్, సంగీత రెడ్డి, సంతోష్, రమణ, సంపత్ రెడ్డి, సుధాకర్ నాయక్, మధుసూదన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.