జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లో డిసెంబర్ 21 (ఆదివారం) నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో (కాంప్రమైజ్) పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తమపై లేదా తమకు తెలిసిన వారు, బంధువులపై ఏవైనా కేసులు ఉన్నట్లయితే ఈ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇలా రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని స్పష్టం చేశారు.
పెండింగ్ కేసుల పరిష్కారం కోసమే ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీసు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు.
జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించే కేసుల విభాగాలు:
- యాక్సిడెంట్ కేసులు
- సివిల్ కేసులు
- చీటింగ్ కేసులు
- చిట్ ఫండ్ కేసులు
- భూ తగాదాలకు సంబంధించిన కేసులు
- వివాహ బంధానికి సంబంధించిన కేసులు
- చిన్నచిన్న దొంగతనం కేసులు
- డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
- కుటుంబ తగాదాలు
- బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కేసులు
- టెలిఫోన్ బకాయిల కేసులు
- కొట్టుకున్న కేసులు
- సైబర్ క్రైమ్ కేసులు
- చెక్ బౌన్స్ కేసులు
ఈ జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని కేసులను పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు తప్పక వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

Post a Comment