సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దళిత సంఘాల నిరసన
కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రుద్రంపూర్ ఓపెన్‌కాస్ట్ ఓబీలో పనిచేస్తున్న సౌదా కాంట్రాక్ట్ కంపెనీ యాజమాన్యం దళిత కార్మికులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ దళిత సంఘాల నాయకులు శుక్రవారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలలో దళితులకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందని ప్రకటించినప్పటికీ, సౌదా కంపెనీ మేనేజర్ కామేష్ వర్మ గత ఆరు నెలలుగా దళితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం దుర్మార్గమని ఆందోళనకారులు విమర్శించారు. ఉద్యోగాల పేరుతో కాలయాపన చేస్తూ దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా TMRPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ మాట్లాడుతూ, “దళితులకు న్యాయం జరిగే వరకు సౌదా కంపెనీపై పోరాటం ఆగదు. వెంటనే దళితులకు ఉద్యోగాలు కల్పించాలి. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు గుండా శ్రీనివాస్, టి. కిషోర్, ఎస్. ప్రశాంత్, మచ్చ పృధ్విరాజ్, కె. సురేష్, ఎం. శ్రీనివాస్, డి. ఆదినారాయణ, టి. రాజు, అజిత్ తదితరులు పాల్గొన్నారు. దళితులకు ఉద్యోగాలు కల్పించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని నాయకులు స్పష్టం చేశారు.

Post a Comment