RG-3 జీఎం నరేంద్ర సుధాకరరావుకు ఉద్యోగ విరమణ సన్మానం

RG-3 జీఎం నరేంద్ర సుధాకరరావుకు ఉద్యోగ విరమణ సన్మానం


8 ఇంక్లైన్ కాలనీ: రామగుండం-3 ఏరియా RG-3 OCP-1 గనిలో ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్న రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు మరియు ఆయన సతీమణి, సేవా అధ్యక్షురాలు అలివేణి సుధాకరరావులను OCP-1 ప్రాజెక్ట్‌లో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో హింద్ మజ్దూర్ సభ (HMS) జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ దంపతులను శాలువాలు కప్పి సన్మానిస్తూ, ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందంగా గడవాలని ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు, అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్, OCP-1 అధికారులు, మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉదయ్ భాస్కర్, ఇన్‌చార్జ్ మేనేజర్ రమేష్, RG-3 HMS ఉపాధ్యక్షుడు వీరయ్య, బ్రాంచ్ సెక్రటరీ పెసర స్వామి, పిట్ సెక్రటరీ సంగి రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.