అంబేద్కర్ భవన్‌లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

అంబేద్కర్ భవన్‌లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు
రామవరం ఘనంగా నిర్వహించిన మాదిగ సంక్షేమ సంఘం

కొత్తగూడెం, జనవరి 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడు వెంకన్న అధ్యక్షత వహించగా, జిల్లా నాయకులు మాతాంగి లింగయ్య, చాట్ల రామారావు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలో జన్మించారని, భారతదేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచిన ఆమె సేవలు చిరస్మరణీయమని అన్నారు.

1848లో తన భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ, సమాజ సంస్కరణకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి పూలే వెనుకబడిన వర్గాల బాలికల కోసం పూణేలో తొలి పాఠశాలను స్థాపించి విద్యా వెలుగులు నింపారని తెలిపారు. మహిళా విద్య కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకుని జనవరి 3న ‘మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం’గా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సిఫార్సు చేయడం హర్షణీయమైన విషయం అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడు వెంకన్న, జిల్లా నాయకులు మాతాంగి లింగయ్య, కొత్తూరు మదనయ్య, చాట్ల రామారావు, మద్దికుంట గణేష్, నాగేల్లి రామకృష్ణ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.