మున్సిపల్ ఎన్నికల ఫిర్యాదుల కోసం 24 గంటల కంట్రోల్ రూమ్ – 9381082501ను సంప్రదించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలు–2026ను పూర్తిగా పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మీడియా సెల్ సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు, ఎంసిఎంసి (MCMC) అంశాలు, ఇతర ఎన్నికల ఫిర్యాదులపై ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్ 9381082501ను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ కంట్రోల్ రూమ్‌లో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని, అందిన ప్రతి ఫిర్యాదును రిజిస్టర్‌లో నమోదు చేసి, సంబంధిత అధికారుల ద్వారా తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనల మేరకు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.

Post a Comment